భూపాలపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తున్నా. అంబేడ్కర్ చౌరస్తా నుంచి క్రిష్ణకాలనీ, సుభాష్‌కాలనీ మీదుగా జంగేడు వరకు రహదారి విస్తరణ, సుందరీకరణ పనులు, జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.21.50 కోట్లు మంజూరు చేసింది. ఇంకా ఎన్ని నిధులు అవసరమైనా ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తా. బుడా ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతా.
– గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్యే
ఇంకా ఆదేశాలు రాలేదు
బుడా ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. బుడా మ్యాప్, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి జీఓ విడుదల కాగానే భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఉదయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్


