24 గంటల తర్వాతే న్యాయం | - | Sakshi
Sakshi News home page

24 గంటల తర్వాతే న్యాయం

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

కాళేశ్వరం: ఇసుక లారీ ఢీకొని మహదేవపూర్‌ మండల కేంద్రానికి చెందిన పోత స్వామి (45) దుర్మరణం చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బీరాసాగర్‌ వద్ద మంగళవారం ఉదయం ఢీకొనడంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, మార్చురీలో ఉన్న స్వామి మృతదేహాన్ని చూపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఈ నిరసనకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులతో మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం వరకు స్థానికులు, కుటుంబ సభ్యులు అధికారులతో చర్చలు జరిపారు. చివరకు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని టీజీఎండీసీ, లారీ యజమాని, ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్లు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సుమారు 24 గంటల తర్వాత నిరసన విరమించారు. అనంతరం, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, మృతుడి భార్య స్వరూప, కుమార్తెలు సాయిశ్రీ, శ్రావణి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సాంబమూర్తి, శశాంక్‌ పర్యవేక్షించారు. కాగా, బాధిత కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్‌ బుధవారం పరామర్శించారు.

లారీ ఢీకొని దుర్మరణం చెందిన

పోత స్వామి మృతదేహం మార్చురీలోనే..

ఆస్పత్రి వద్దనే కుటుంబ సభ్యుల నిరీక్షణ

ఎట్టకేలకు అధికారుల జోక్యంతో

నిరసన విరమణ

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement