పెన్షనర్లకు డీఎల్‌సీ క్యాంపులు | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు డీఎల్‌సీ క్యాంపులు

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్ల సౌకర్యార్థం డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ (డీఎల్‌సీ) సమర్పణకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యాంసుందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 12వ తేదీల్లో భూపాలపల్లిలోని కృష్ణాకాలనీ మినీ ఫంక్షన్‌ హాల్‌లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పెన్షనర్లు ప్రతీ సంవత్సరం సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ను డిజిటల్‌ విధానంలో సులభంగా పూర్తి చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్‌ చెల్లింపులు నిరంతరాయంగా కొనసాగాలంటే లైఫ్‌ సర్టిఫికెట్‌ను సకాలంలో సమర్పించడం తప్పనిసరని తెలిపారు. పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత తేదీల్లో క్యాంపులకు హాజరై డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని శ్యాంసుందర్‌ సూచించారు.

ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి

మల్హర్‌(కాటారం) : మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో బుధవారం తెలంగాణ సాంస్కతిక సారథి కళాకారులు ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా ఎల్‌నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని వివరించారు. రైతులు సాగునీటి లభ్యతను దృష్ట్యా వరి సాగు చేయాలని, నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో పెసర్లు, శనగలు, కందులు, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని కోరారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కమ్మల ప్రవీణ్‌కుమార్‌, పులి రాధిక, కాస స్వాతి, ఆత్మకూరి మహేందర్‌, ఓనపాకల కుమార్‌, చిలుముల మధుబాబు, గడ్డం నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement