ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

కాళేశ్వరం: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆదేశించారు. పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మహదేవపూర్‌ పోలీసుస్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సాంబమూర్తి తదితరులు ఉన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement