వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలి

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

భూపాలపల్లి అర్బన్‌: యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, వక్తృత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడమే తమ లక్ష్యమని జిల్లా యువజన అధికారి భూక్య సంజీవ, డీవైఎస్‌ఓ రఘు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత్‌ భారత్‌ – యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌లో భాగంగా వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ అనే అంశంపై విద్యార్థులకు బుధవారం ఉపన్యాస పోటీలు నిర్వహించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల విధానం, జాతీయ అభివృద్ధిలో యువత పాత్రపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ రమణరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ రుక్సానా, డాక్టర్‌ కవిత, డాక్టర్‌ చంద్రకళ, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చెందిన డాక్టర్‌ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement