ఘనంగా రీజినల్‌ స్థాయి కల్చరల్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రీజినల్‌ స్థాయి కల్చరల్‌ మీట్‌

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి వర్క్‌పీపుల్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏరియాలోని కృష్ణకాలనీ కమ్యూనిటీహాల్‌లో రీజినల్‌ స్థాయి కల్చరల్‌ మీట్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ కార్యక్రమాల గౌరవ కార్యదర్శి మర్రి సాయికృష్ణ పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులకు సాంస్కృతిక కార్యక్రమాలు మానసికోల్లాసాన్ని, నూతన ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతతోపాటు మహిళా ఉద్యోగులు కూడా తమలోని కళా ప్రతిభను చాటుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కల్చరల్‌ మీట్‌లో జానపద, లలిత గీతాలు, గజల్స్‌, కర్ణాటక సంగీతం, వీణ, గిటార్‌, సింథసైజర్‌, వయోలిన్‌, క్లారినెట్‌, బాంజో, హార్మోనియం వంటి సంగీత విభాగాలతోపాటు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం, ఆర్కెస్ట్రా విభాగాల్లో కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారి ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు తదుపరి కంపెనీ స్థాయి పోటీలకు అర్హత సాధించనున్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్‌ న్యాయ నిర్ణేత కుంట రాజు, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌, భూపాలపల్లి స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, కల్చరల్‌ కెప్టెన్‌ అడిచర్ల శ్రీనివాస్‌, క్లబ్‌ సెక్రటరీ కాపు చంద్రశేఖర్‌, ఆర్జీ–3 స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ సదానందం, కల్చరల్‌ కెప్టెన్‌ నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement