మూడు ట్రాక్టర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

మూడు ట్రాక్టర్లు సీజ్‌

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

భూపాలపల్లి అర్బన్‌: వ్యవసాయ అవసరాల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్లను వాణిజ్య రవాణాకు ఉపయోగిస్తున్న వారిపై రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో మంజూర్‌నగర్‌, బాంబులగడ్డ ప్రాంతాల్లో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ట్రాక్టర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ మట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఫహిమ సుల్తానా, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లను వాణిజ్య రవాణాకు ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై తనిఖీలు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement