కాటారం మండలం చిదినేపల్లి గ్రామానికి చెందిన పందుల సమ్మయ్య కొన్నేళ్ల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. దీంతో ఎడమ చేయి, కాలు పనిచేయకపోవడంతో నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. తోడుగా ఒకరు ఉంటేనే బయటకు వెళ్లగలుగుతున్నాడు. తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సదరం సర్టిఫికెట్ జారీ చేయడంతోపాటు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాడు.
– పందుల సమ్మయ్య
●


