గణపురం : సోమవారం పర్వదినం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం గణపేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు.
నేడు నిజామాబాద్
బీఆర్‌ఎస్ బృందం రాక
కాళేశ్వరం: మేడిగడ్డ బరాజ్‌ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ బృందం నేడు(మంగళవారం) సందర్శించనుంది. మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గంటలకు జిల్లా ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ శాసన మండలి సభ్యులు సందర్శనకు వస్తున్నట్లు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
చిట్యాల: మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జి.నవ్య జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ వెన్నెల, పీఈటీ శారద తెలిపారు. గతనెల 30న అంబర్‌పేట్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగిన రాష్ట్రస్ధాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో నవ్య తన ప్రతిభను కనబరిచిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని కళాశా ల ప్రిన్సిపాల్ గొల్కొండ భిక్షపతి, వైస్ ప్రిన్సి పాల్ మాలతి లత అభినందనలు తెలిపారు.
హెచ్‌ఐవీ నియంత్రణలో జాతీయ గుర్తింపు
భూపాలపల్లి అర్బన్: òßæ^Œl-IÒ °Ä¶æ$…-{™èl-׿ÌZ hÌêÏ 95:95:95 ÌS„>Å-ÌS¯]l$ Ý뫨…_ çÜ$Æý‡-„ìS™èl hÌêÏ-V> VýS$Ç¢…ç³# ´÷…§ýlyýl… AÀ-¯]l…-§ýl-±Ä¶æ$-Ð]l$° MýSÌñæ-MýStÆŠ‡ Æ>çßæ$-ÌŒæ-ÔèæÆý‡Ã A¯é²Æý‡$. Ý뫨…_¯]l ÑfĶæ$…-™ø BVýS-MýS$…yé hÌêϯ]l$ çÜ$Æý‡-„ìS™èl ç³Ï‹Ü Ýë¦Æ‡$$MìS ¡çÜ$-MðS-âôæÏ…§ýl$MýS$ Ð]l$Ç…™èl çÜÐ]l$-Æý‡¦-Ð]l…-™èl…-V> ç³°^ól-Ķæ*-ÌS° A«¨M>Æý‡$-ÌSMýS$ ¨Ô>-°Æó‡ªÔèæ… ^ólÔ>Æý‡$. ÝùÐ]l$-ÐéÆý‡… MýSÌñæ-MýSt-Æó‡-sŒæ-ÌZ °Æý‡Ó-íßæ…_¯]l çÜÐ]l*ïŒS çÜÐ]l*-Æø‹ßæÌZ òßæ^Œl-IÒ °Ä¶æ$…-{™èl-׿MýS$ ÑÔóæçÙ MýS–íÙ ^ólíܯ]l OÐðl§ýlÅ BÆøVýSÅ Ô>Q A«¨M>Æý‡$-Ë$, íܺ¾…¨, çÜÓ^èle…§ýl çÜ…çܦÌS {糆°«§ýl$-ÌS¯]l$ MýSÌñæ-MýStÆŠ‡ Ô>Ë$ÐéË$, gêqí³-MýS-ÌS-™ø çÜ™èlP-Ç…^éÆý‡$. gê¡Ä¶æ$ GƇ$$yŠæÞ °Ä¶æ$…-{™èl-׿ çÜ…çܦ (¯éMø) VýS$Ç¢…_¯]l D {ç³VýS† Ððl¯]l$MýS OÐðl§ýlÅ íܺ¾…¨, çÜÓ^èle…§ýl çÜ…çܦÌS çÜÐ]l$íÙt MýS–íÙ E…§ýl° {ç³Ôèæ…-íÜ…^éÆý‡$. hÌêÏ-ÌZ òßæ^Œl-IÒOò³ AÐ]l-V>çßæ¯]l M>Æý‡Å-{MýS-Ð]l*-ÌS¯]l$ Ð]l$Ç…™èl ÑçÜ–¢™èl… ^ólĶæ*-ÌS°, ç³È„ýS-Ë$, _MìS™èlÞ, »ê«¨-™èl$-ÌSMýS$ A…¨…^ól õÜÐ]l-ÌZÏ gêç³Å… E…yýl-MýS*-yýl-§ýl° MýSÌñæ-MýStÆŠ‡ çܵçÙt… ^ólÔ>Æý‡$. A°² Ô>QË$ çÜÐ]l$-¯]lÓ-Ķæ$…-™ø ç³°^ólíÜ òßæ^Œl-IÒ Æý‡íßæ™èl çÜÐ]l*f °Æ>Ã-×ê°MìS MýS–íÙ ^ólĶæ*-ÌS° í³Ë$ç³#-°^éaÆý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆŠ‡ ÑfĶæ$-ÌS-„ìSÃ, yîlG…òßæ-^ŒlK yéMýStÆŠ‡ Ð]l$«§ýl$-çÜ*-§ýl¯Œl, ¨Ôèæ ïÜG‹ÜK ÝëÆý‡Ä¶æ$Å, yîlG…ÒyîlK ÝëÆ‡$$, IïÜsîæ-ïÜ Mú°ÞÌSÆŠ‡ Æý‡Ðól$ÔŒæ, OÐðl§ýlÅ íܺ¾…¨, çÜÓ^èle…§ýl çÜ…çܦÌS {糆°«§ýl$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘
21 రకాల వస్తువులు
సరఫరా చేయాలి
ఏటూరునాగారం: హాస్టల్ విద్యార్థులకు 21 రకాల వస్తువుల సరఫరాను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సంతోశ్ అన్నారు. హైదరాబాద్ నుంచి ఐటీడీఏ పీఓలు, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలతో పాటు రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. విద్యార్థులకు అందించాల్సిన 21 రకాల వస్తువుల స్థితిగతులు, 2027–28 విద్యా సంవత్సరానికి అవసరమైన వస్తువుల ఇండెంట్ సిద్ధం చేయాలని సూచించారు.


