మల్హర్ మండలం కొయ్యూరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఉపసర్పంచ్ లకావత్ సవేందర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొండా రాజమ్మ, పంచాయతీ కార్యదర్శి పంచగిరి రాజు తప్పుడు లెక్కలు చూపిస్తూ పంచాయతీ నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ హోదాలో పంచాయతీ రికార్డులపై సంతకాలు చేయాల్సి ఉండగా, నిధుల ఖర్చులపై అనుమానాలు ఉండటంతో తప్పుడు లెక్కలుగా భావిస్తున్న రికార్డులపై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలిపారు. సమగ్రంగా పరిశీలించి నిధుల వినియోగంపై విచారణ జరపాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు తనపై జరుగుతున్న బెదిరింపులపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు.
స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలి
తమకు వేతనాలు చెల్లించాలని, నేరుగా కార్మికుల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేయాలని స్కావెంజర్ల కలెక్టర్‌ను వేడుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం పని చేస్తున్నామని, స్వీపర్ల జీవితాలపై ప్రభుత్వ అనుసరిస్తున్న ధోరణి సరైనదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లకు ప్రత్యేక ఐడీ కార్డులు ఇవ్వాలని కోరారు.


