భూపాలపల్లి : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 13 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
ఎస్పీ సంకీర్త్


