కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలి

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

● సీపీఐ జిల్లా కార్యదర్శి

కొరిమి రాజ్‌కుమార్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు సాగు చేయలేక నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్‌లో సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని వరి సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ ప్రభుత్వం వరి సాగు చేయవద్దని సూచించడంతో అనేకమంది రైతులు పంటలు వేయలేక నష్టపోయారన్నారు. ప్రభుత్వం జిల్లాలో కేవలం ఆరింటినే కరువు మండలాలుగా ప్రకటించిందని, మిగిలిన మండలాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలను కూడా గుర్తించి పరిహారం అందించాలని కోరారు. తాగునీరు, సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి కరువు ప్రభావిత మండలాల్లో సీపీఐ బృందం పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పైండ్ల శాంతికుమార్‌, కార్యవర్గ సభ్యులు సోత్కు ప్రవీణ్‌ కుమార్‌, క్యాతరాజ్‌ సతీశ్‌, కొరిమి సుగుణ, కుడుదుల వెంకటేష్‌, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement