● మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మొగుళ్లపల్లి మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నూతన మండల కార్యాలయాన్ని ఆదివారం గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతతో అనేకమంది నాయకులు, కార్యకర్తలు తిరిగి బీఆర్‌ఎస్ వైపు మండల స్థాయి నాయకులు బీఆర్‌ఎస్‌వైపు వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామస్వామి నాయక్, బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బలుగురి తిరుపతి రావు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడారి రమేశ్, పర్లపల్లి సర్పంచ్ జోరుక సదయ్య, సర్పంచ్‌లు నరహరి వెంకట్ రెడ్డి, అరెల్లి రమేశ్, గాదం శ్రీవాణి రమేశ్, మండల నాయకులు పాల్గొన్నారు.


