భూపాలపల్లి అర్బన్: జిల్లా పరిధిలోని భూపాలపల్లి, కాటారం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఎల్.లలిత, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 223 మందికి గాను 208 మంది, కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో 155 మందికి గాను 140 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వసతులు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.


