కాళేశ్వరం: సాధారణంగా ప్రతీ సంవత్సరం దసరా, దీపావళి సమయంలో కూరగాయల ధరలు కొంత అందుబాటులో ఉంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, నీటి ఎద్దడి కారణంగా కూరగాయల సాగు దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా ధరలు చూసి సామాన్యులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రతికూలతలు, సాగునీటి సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుండగా.. పెరిగిన ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ధరలను నియంత్రించాలని మొరపెడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని 12 మండలాల్లో కొత్తపల్లిగోరి, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.
దిగుబడులు తగ్గి.. ధరలు పెరిగి!
జిల్లాకు వరంగల్, కరీంనగర్ మార్కెట్‌లతో పాటు జిల్లాలోని పలు మండలాల నుంచి ఆయా ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. మిగతా మండలాల్లో వారసంతలు నిర్వహించడంతో పాటు మండల, గ్రామస్థాయిలో జరిగే సంతలకు స్థానిక రైతులు తమ పొలాల్లో పండించిన కూరగాయలను తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీంతో రైతులకు ఉపాధి లభించడంతోపాటు వినియోగదారులకు స్థానికంగా కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం సాగు తగ్గడం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి మారుతోంది. దీనికి తోడు పంటలను పురుగులు ఆశించడంతో దిగుబడి తగ్గినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు.
ఎండిపోతున్న తోటలు..
రైతులకు కష్టాలు
ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. బావుల్లో నీరు అడుగంటిపోవడం, బోరుబావుల్లో సైతం అరకొరగా నీరు వస్తుండటంతో పంటలకు తగినంత తడులు అందించడం కష్టంగా మారింది. అక్కడక్కడ సాగుచేసిన కూరగాయల తోటలు కూడా ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవించే రైతులకు పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తమవుతోంది.
కిలో ధర ఇలా..
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పెరిగిన కూరగాయల ధరలు
ఎండల తీవ్రతకు తగ్గిన దిగుబడి
ధరలు నియంత్రించాలని
సామాన్యుల మొర
చిక్కుడు రూ.100
పచ్చిమిర్చి రూ.100
క్యారెట్ రూ.80
క్యాప్సికం రూ. 80
వంకాయ రూ. 60
బీట్‌రూట్ రూ. 60
కాకరకాయ రూ. 60
కాలీఫ్లవర్ రూ. 60
గోరుచిక్కుడు రూ. 60
బీరకాయ రూ. 80
కొత్తిమీర రూ. 80
టమాట రూ. 40


