83శాతం బొగ్గు ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

83శాతం బొగ్గు ఉత్పత్తి

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ బొగ్గు గనుల్లో అక్టోబర్‌ మాసంలో 83 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అక్టోబర్‌ నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు. అక్టోబర్‌లో 3.72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా, 3.07 లక్షల టన్నులు సాధించి 83 శాతం ప్రగతిని నమోదు చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 10,212 టన్నులు వెలికితీసినట్లు తెలిపారు. ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఓవర్‌బర్డెన్‌ (ఓబీ) తొలగింపులో మాత్రం లక్ష్యాన్ని అధిగమించామన్నారు. ఓసీపీ–2,3 గనుల్లో కలిపి 29.76 లక్షల క్యూబిక్‌ మీటర్ల లక్ష్యానికి గాను 30.01 లక్షల క్యూబిక్‌ మీటర్లు తొలగించి 101 శాతం ప్రగతి సాధించినట్లు చెప్పారు. ఈ నెలలో ఏరియా పరిధిలో 4.77 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అంతే మొత్తంలో రవాణా లక్ష్యంగా నిర్దేశించినట్లు వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో 76శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. రానున్న ఐదు నెలల్లో 36లక్షల టన్నుల బొగ్గు లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉందన్నారు. సింగరేణి కార్మికులు, అధికారులు సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో వర్షాల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని.. ఈ నెల నుంచి ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తామని తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతుందని తెలిపారు. సింగరేణిలో ఈ ప్రభావంగా తీవ్రంగా ఉంటుందని బొగ్గు ఉత్పత్తితో రవాణాపై ప్రభావం ఉంటుందన్నారు. సింగరేణి కార్మికులు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని, విద్యుత్‌, తాగునీరు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్యామ్‌సుందర్‌, సాయి, నాగేందర్‌ పాల్గొన్నారు.

ఓబీ తొలగింపులో 101 శాతం ప్రగతి

ఈ మాసంలో 4.77 లక్షల టన్నులు లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement