ఉన్నత శిఖరాలకు ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరాలకు ఎదగాలి

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

గణపురం: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌కుమార్‌ నాయక్‌ అన్నారు. సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గణపురం మండలకేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా క్రమ శిక్షణతో పెరిగితే వారి జీవితాలకు బంగారు భవిష్యత్‌ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గణపురం ఎస్‌ఐ అశోక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement