పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఒజ్జ కిరణ్. టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామంలో ఐదు ఎకరాలను ఎకరానికి రూ.23వేల చొప్పున కౌలుకు తీసుకొని కూరగాయల సాగు చేశాడు. 20 రోజుల కిందట ఎకరం భూమిలో కొత్తిమీర విత్తనాలు అలికాడు. నాలుగు ఎకరాల్లో మిర్చి, టమాట, బీరకాయ, బెండకాయ తదితర పంటలు సాగుచేశాడు. ఎల్నినో ఎఫెక్టుతో ఎండ తీవ్రతకు నల్లగా మారి కొత్తిమీర మొలకెత్తలేదు. దీంతో రూ.40వేల వరకు నష్టపోయాడు. ప్రస్తుతం మబ్బుల కారణంగా కూరగాయల పంట పూత రాలుతుంది. పురుగు కూడా ఆశిస్తుంది. మందులకు డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిపాడు.
– ఒజ్జ కిరణ్, పెద్దంపల్లి, టేకుమట్ల మండలం


