గొప్ప వైద్యులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

గొప్ప వైద్యులుగా ఎదగాలి

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

● వైట్‌కోట్‌ వేడుకలో పిలుపు

భూపాలపల్లి అర్బన్‌: వైద్య విద్యార్థులు అంకితభావం, సేవా దృక్పథంతో చదువుకుని గొప్ప వైద్య నిపుణులుగా ఎదిగి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. శుక్రవారం భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన వైట్‌కోట్‌ వేడుకలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్య వృత్తి ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవ సేవకు అంకితమైన పవిత్ర బాధ్యత అన్నారు. వైట్‌కోట్‌ నిబద్ధత, సేవాభావానికి ప్రతీక అన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతపై అవగాహన పెంచుకుంటూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలన్నారు. వైద్య కళాశాల అభివృద్ధికి రూ.130 కోట్లతో భవనాలు, బాలురు, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే బాలికల హాస్టల్‌ ప్రారంభించామని, 15 రోజుల్లో బాలుర హాస్టల్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యార్థుల రవాణా కోసం సింగరేణి సంస్థ ద్వారా రెండు బస్సుల కొనుగోలుకు రూ.80లక్షలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కళాశాలలో మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ కళాశాల 91శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రి రూ.15కోట్లతో నిర్మించిన బాలికల హాస్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీప్రకాశ్‌, ప్రజాప్రతినిధులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌రావు, వైద్యాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement