నిర్మాణ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

● హైకోర్టు జడ్జికి బార్‌ అసోసియేషన్‌ వినతి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కోర్టులో న్యాయమూర్తులను నియమించి, నూతన కోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ జె.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. అంతకు ముందుకు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించి శాలువతో సన్మానించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూనూరి సురేష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు ఆధ్వర్యంలో హైకోర్టులో న్యాయమూర్తిని కలిసి జిల్లాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను వివరించారు. న్యాయమూర్తుల నియామకం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో కేసుల పరిష్కారం వేగవంతమవుతుందన్నారు. వినతిపై జస్టిస్‌ జె.శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ జి.రాజేందర్‌, లైబ్రరీ సెక్రటరీ అకినపల్లి రవికుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement