● గిరిజన సంక్షేమ శాఖ
జిల్లా అధికారి నాగసాగర్
భూపాలపల్లి అర్బన్: డివిజన్ స్థాయి క్రీడా పోటీలను ప్రణాళికాబద్ధంగా, విజయవంతంగా నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి నాగసాగర్ సూచించారు. గురువారం డీటీఓ కార్యాలయంలో ఫిజికల్ డైరెక్టర్లు (పీడీలు), వ్యాయామ ఉపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసాగర్ మాట్లాడుతూ.. నవంబర్ 11, 12వ తేదీల్లో కాటారం మండలం మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో డివిజన్ స్థాయి పోటీల నిర్వహణకు ముందస్తు కార్యాచరణ రూపొందించి, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా క్రీడా మైదానాలు, తాగునీరు, భోజనం, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా పీడీలు చొరవ చూపాలన్నారు. ప్రతీ క్రీడకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పోటీలను పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాల పెంపునకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి నాగసాగర్ సూచించారు. గురువారం గొల్లబుద్దారం గ్రామంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని మౌలిక సదుపాయాలు, నిత్యావసర సరుకుల నిల్వలు, వాటి నాణ్యత ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భో జనం నాణ్యతపై ఆరాతీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రో త్సహించాలని సూచించారు. ఈ తనిఖీలో వసతి గృహ సంక్షేమాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.


