భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు పోక్సో కేసులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జంగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, పోక్సో చట్టం నిబంధనలు తెలుసుకోవాలని తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. తెలంగాణ మైనారిటీ బాలుర గురుకులంలో నిర్వహించిన మరో అవగాహన కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల పాల్గొని పోక్సో చట్టంపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజ కొమురయ్య, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ తిరుపతి, సూపరింటెండెంట్ రఘురాం, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


