● లంచం అడిగితే 1064కు
ఫిర్యాదు చేయండి
● ఏసీబీ డీఎస్పీ సాంబయ్య
భూపాలపల్లి అర్బన్: అవినీతి రహిత సమాజమే లక్ష్యమని, లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. విజిలెన్స్ వారోత్సవం–2026లో భాగంగా జిల్లా వైద్య ఆరో గ్యశాఖ కార్యాలయంలో బుధవారం అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువల ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులను నిబద్ధతతో నిర్వహించాలని, అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించొద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తెలంగాణ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అవినీతికి దూరంగా ఉంటూ నిజాయితీతో విధులు నిర్వహిస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు దేవేందర్, శ్రీదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


