నాణ్యమైన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యనందించాలి

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

గణపురం: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం గణపురం మండలకేంద్రంలోని పీఎంశ్రీ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన తీరు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ఆరాతీస్తూ అ న్ని తరగతుల్లో వందశాతం హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖగుర్తింపు హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌ రావు, ప్రిన్సిపాల్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement