ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన బాధ్యతలు నిర్వహిస్తున్నాం. కానీ వేతనాలు, ఇతర ప్రయోజనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, అన్ని కేడర్ల సమస్యలను పరిష్కరించాలి. – డాక్టర్ ప్రవళిక, పల్లె దవాఖాన వైద్యురాలు
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
మా డిమాండ్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, భవిష్యత్‌పై భరోసా కోసమే పోరాడుతున్నాం. ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చి సమస్యలను పరిష్కరించాలి. అప్పటివరకు మా ఆందోళన కొనసాగుతుంది.
– ప్రవీణ్, డాటా ఎంట్రీ ఆపరేటర్


