భద్రత కరువు! | - | Sakshi
Sakshi News home page

భద్రత కరువు!

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

డిమాండ్లు ఇవే..

● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరిని రెగ్యులర్‌ చేయాలి

● ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసి, స్టేట్‌ హెల్త్‌ సొసైటీలోనే కొనసాగిస్తూ స్పార్స్‌ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలి.

● ప్రతీ సంవత్సరం 5శాతం ఇంక్రిమెంట్‌, 8శాతం లాయల్టీ బోనస్‌

● కేడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయాలి

● రూ.20లక్షల ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి

● ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్‌ఐ, ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం కల్పించాలి

● ప్రతీ నెల 5వ తేదీలోపు వేతనాలు, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ ఏరియర్స్‌ చెల్లించాలి.

ఉద్యోగం

ఉన్నా..

భూపాలపల్లి అర్బన్‌: ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య సేవల్లో కీలకంగా పనిచేస్తున్న వారే నేడు తమ భవిష్యత్‌పై భరోసా లేక ఆందోళన బాట పట్టారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రత లేదు.. చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారంగా మారింది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. దక్కే ప్రయోజనాలు మాత్రం పరిమితమే. ఇదీ జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల ఆవేదన. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్‌లలో వివిధ కేడర్లకు చెందిన 250మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు.

సేవలు కీలకం.. భవిష్యత్‌పై ఆందోళన

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, వ్యాధుల నియంత్రణ, ప్రాథమిక వైద్యసేవల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర కీలకం. వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితరులు ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. అయినప్పటికీ తమకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమ్మెతో సేవలకు ఇబ్బందులు

జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యసేవలు, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై ప్రభావం పడుతుంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు వైద్యసేవలు నిరంతరంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

250మంది ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది ఆవేదన

సమ్మెతో వైద్యసేవలకు ఆటంకం

పట్టించుకోని ప్రభుత్వం

ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ,

సమాన పనికి సమాన వేతనం కోసం

ఎదురుచూపు

15వ రోజుకు చేరిన దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement