భూపాలపల్లి రూరల్: ఓటు హక్కు పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్ కేబీఆర్ నాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేబీఆర్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మహా ర్యాలీకి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటు హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా పరిశీలనకు మండల, డివిజన్ స్థాయిలో సమావేశాలు.. గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీ సమన్వయకర్త అరికెల నర్సారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, ఐత ప్రకాశ్‌రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏఐసీసీ అబ్జర్వర్ కేబీఆర్ నాయుడు


