ఆరుతడి పంటలు సాగుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగుచేయాలి

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

గణపురం: సూపర్‌ ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాపాతం లోటు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంట సాగుకు బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి జాడి బాబురావు సూచించారు. మంగళవారం గణపురం మండలం చెల్పూరు రైతు వేదికలో ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా భూ సంరక్షణ ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుతడి పంటలుగా జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, కంది, పెసరు, శనగ, వేరుశనగ, మినుము, నువ్వుల లాంటి తదితర పంటల సాగును ఎంచుకోవాలన్నారు. ముఖ్యంగా తక్కువ నీటితో సాగు చేయగల పంటను ఎంచుకోవడం ద్వారా నీటి వనరులను సంరక్షించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాస్త్రవేత్త మదన్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement