గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని భక్తుల దర్శనార్ధం ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందచేశారు.

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి అర్బన్‌: ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి లలిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల నుంచి ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

14వ రోజుకు చేరిన సమ్మె

భూపాలపల్లి అర్బన్‌: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా సోమవారం ఉద్యోగులు తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్ట్‌కార్డుల ద్వారా ఉత్తరాలు పంపించారు. సమ్మెకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు కీర్తిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి మధు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశ్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రఘురాం, కోశాధికారి శ్రీను, సలహాదారులు శ్రీనివాస్‌, జిల్లా కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌, డాక్టర్లు జగదీశ్‌, విజయ్‌, బాలకృష్ణ, మీడియా ఇన్‌ఛార్జి రాజు, కృష్ణవేణి, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.

కోజాగరి పౌర్ణమి

ప్రత్యేక పూజలు

కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం(బాలాలయం)లో కోజాగరి పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు ఫణింద్రశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా, రాత్రి 10 గంటలకు భజనలు, 11,30 గంటల నుంచి కౌముది పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు పాలలో చంద్రుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, ధర్మకర్త గంధేసిరి సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉమామహేశ్‌, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి బాలల పరిరక్షణే

దేశ బంగారు భవిష్యత్‌

గణపురం: దేశ బంగారు భవిష్యత్‌ నేటి బాలల పరిరక్షణతోనే సాధ్యమవుతుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి అన్నారు. సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌, బాలల పరిరక్షణపై గణపురం కేజీబీవీలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడూరు మహతి వైష్ణవి మాట్లాడుతూ పోక్సో నేరాల నివారణ, సైబర్‌ మోసాల నుంచి పిల్లలను కాపాడుకోవడం మన ప్రథమ కర్తవ్యం అన్నారు. అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.అఖిల మాట్లాడుతూ ప్రతీ బిడ్డ బాల్యం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ వెంకటస్వామి, కోఆర్డినేటర్‌ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement