అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

భూపాలపల్లి: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. అమరుల ధైర్యసాహసాలు, అంకితభావం ప్రతీ పోలీస్‌ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం అమరవీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించడమే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్‌, ఆర్‌ఐలు రత్నం, సంతోష్‌, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, స్పెషల్‌ పార్టీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వాల్మీకి బోధనలు ఆదర్శం..

మహర్షి వాల్మీకి బోధనలు ఆదర్శంగా తీసుకొని నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌ సూచించారు. వాల్మీకి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసిన అనంతరం ఏఎస్పీ మాట్లాడారు. రామాయణ మహా కావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. ఆయన రచనలు సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలను తరతరాలకు చాటి చెబుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు సంతోష్‌, రత్నం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement