పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

భూపాలపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సోమవారం సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల జాబితాను నవంబర్‌ 1 అర్హత తేదీగా నిర్ణయించి నూతనంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి, జెన్‌కో సంస్థలకు ప్రత్యేకంగా లెటర్‌ రాసినట్లు తెలిపారు.

యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా మీ ప్రమాణం యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. మీ ప్రమాణం యాప్‌లో నమోదుపై వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం 19 శాఖల అధికారులు మాత్రమే మీ ప్రమాణం యాప్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంతకుమారి, ఈడీఎం శ్రీకాంత్‌ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

గడువులోగా జాబితా సవరణ..

ఎన్నికల సంఘం నిర్ధేశించిన గడువులోగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియ, ఎమ్మెల్సీ ఓటరు నమోదు, ఫారం 6, 7, 8 మరియు ఫారం 18 దరఖాస్తులపై హైదరాబాద్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అబ్బాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement