అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

భూపాలపల్లి అర్బన్‌: అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా ఇన్‌చార్జ్‌ జీఎం డి.శ్యామ్‌ సుందర్‌ పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయంలో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి విధులను నిజాయితీతో, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నిబంధనలను పాటిస్తూ సంస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. విజిలెన్స్‌ అవగాహనను వారోత్సవాలకే పరిమితం చేయకుండా నిత్య విధుల్లో భాగం చేసుకోవాలన్నారు. అవినీతిని అరికట్టడంలో ఉద్యోగులందరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యామ్‌సుందర్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ టి.పోషమల్లు, ఏఐటీయూసీ నాయకుడు మోటపలుకుల రమేశ్‌, ఐఎన్‌టీయూసీ నాయకుడు బి.మధుకర్‌రెడ్డి, సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు నజీర్‌, ఐటీసీ సీనియర్‌ ప్రొగ్రామర్‌ శంకర్‌, జీఎం కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఏరియా ఇన్‌చార్జ్‌ జీఎం శ్యామ్‌సుందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement