చిట్యాల: బాల్య వివాహాలను అరికట్టాలని మహిళా సాధికారత జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని నైన్పాక, జడల్పేట, కొత్తపేట గ్రామాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు , యువత, గ్రామస్తులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నైన్పాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, జెండర్ స్పెషలిస్టులు అనూష, మమత, సురేశ్, అంగన్వాడీ టీచర్ కరుణ, విద్యార్థులు పాల్గొన్నారు.


