● ఊరట్టం జంపన్నవాగుపై
నిర్మాణానికి ప్రణాళిక
● మేడారం వచ్చే భక్తుల రవాణా
మరింత సులభం
● రూ.18.50 కోట్లతో ప్రతిపాదనలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఊరట్టం వద్ద జంపన్న వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంతో ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి ఊరట్టం మీదుగా మేడారం వెళ్లే మార్గంలో రాకపోకలు సులభతరం కానున్నాయి. జాతర సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే ప్రైవేట్ వాహనాలు, ఎడ్లబండ్లకు వంతెన ఎంతో ఉపయోగపడనుంది.
జాతరలో కీలక మార్గం
మేడారం మహాజాతర సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఏటూరునాగారం– కొండాయి మీదుగా పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఊరట్టం మీదుగా మేడారం తరలివస్తుంటారు. ప్రైవేట్ వాహనాలతో పాటు ఎడ్లబండ్లలోనూ భక్తులు ఈ మార్గం నుంచి వస్తుంటారు. జాతర సమయంలో వాహనాల రద్దీ పెరగడంతో జంపన్నవాగుపై ఉన్న వంతెన కీలకంగా మారుతుంది. ప్రస్తుతం ఉన్న లోలెవల్ వంతెన వరదల సమయంలో దెబ్బతింటుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జాతర సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


