35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Aug 27 2026 1:12 AM | Updated on Aug 27 2026 1:12 AM

భూపాలపల్లి అర్బన్‌: పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని భూపాలపల్లి సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్‌ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా టాటా ఏస్‌ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో పట్టణంలోని సీఆర్‌ నగర్‌కాలనీకి చెందిన పావనపు రాజు (డ్రైవర్‌), నీలుగొండ రమేష్‌ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం కేసును పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement