రేగొండ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట, దుంపిల్లపల్లి, మడతపల్లిలో బుధవారం నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎస్‌ఓ కిరణ్ కుమార్, డీఎం రాములు, తహసీల్దార్ శ్వేత, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, కోటంచ ఆలయ మాజీ చైర్మన్ సంపత్ రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, పంట పొలంలో కలుపు తీస్తుండగా నాటు బాంబు పేలి తీవ్ర గాయాలపాలైన మండలంలోని గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె స్వర్ణలతను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిట్యాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని చల్లగరిగ, జూకల్, గోపాలపూర్, జడలపేట, నైన్‌పాక, వరికోల్‌పల్లి, బావుసింగ్‌పల్లి, ఒడితల, లక్ష్మీపూర్ తండా, పాసిగడ్డ తండా, దూత్‌పల్లి, కొత్తపేట, గిద్దెముత్తారం, కాల్వపల్లి, అందుకు తండా, చైన్‌పాక, వెంచరామి, తిర్మలాపూర్, రాంచంద్రాపూర్, ముచినిపర్తి, కైలాపూర్, గుంటూరుపల్లి, చిట్యాల, ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట, చింతకుంట రామయ్యపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాములు, తహసీల్దార్ వసంతరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


