నాణ్యతా ప్రమాణాలతో పనులు | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా ప్రమాణాలతో పనులు

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

యంగ్‌ ఇండియా మోడల్‌ స్కూల్‌ పనుల పరిశీలన

గణపురం: యంగ్‌ ఇండియా మోడల్‌ స్కూల్‌ నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. శనివారం గణపురం మండలం మైలారం గుట్టల వద్ద పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులపై ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. నాలుగు అకాడమిక్‌ బ్లాక్‌లు, సీనియర్‌, జూనియర్‌ డార్మీటరీలు, కిచెన్‌, డైనింగ్‌ హాళ్లు, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ల నిర్మాణ ప్రణాళికను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దన్నారు. కాంక్రీట్‌ గోడల నిర్మాణంలో షియర్‌ వాల్‌ టెక్నాలజీని వినియోగించి పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో చెట్లను తొలగించవద్దని ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పకుండా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలన్నారు. పాఠశాలలో 2,640 మంది విద్యార్థులు 300మంది సిబ్బందికి వసతి కల్పించాల్సి ఉందన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్య, వసతులను అందుబాటులో ఉండేలా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీజీఈడబ్ల్యూడీసీ ఈఈ అరుణ్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఏఈ జీవన్‌, సర్పంచ్‌ సమ్మయ్య నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement