ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం

Aug 22 2026 1:23 AM | Updated on Aug 22 2026 1:23 AM

భూపాలపల్లి: వానాకాలం ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్టీఫెన్‌ రవీంద్ర వానాకాలం ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి హాజరైన అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పౌర సరఫరాల అధికారి కిరణ్‌ కుమార్‌, డీఎం రాములు తదితరులు పాల్గొన్నారు.

రుణాల మంజూరులో వేగం పెంచాలి

భూపాలపల్లి రూరల్‌: వెనుకబడిన రంగాలకు రుణాల మంజూరులో వేగంపెంచాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అధికారులకు సూచించారు. జిల్లాస్థాయి సమావేశం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ లక్ష్యం రూ.2,599.49 కోట్లు కాగా.. జూన్‌ త్రైమాసికం నాటికి రూ.451.73 కోట్లు అంటే 17.38 శాతం సాధించారని స్పష్టంచేశారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.611.03 కోట్ల లక్ష్యానికి గాను రూ.261.51 కోట్లు, 42.80 శాతం రుణాలు అందించారని వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో లీడ్‌ డిస్టిక్ర్ట్‌ మేనేజర్‌ నాగరాజు,బ్యాంకులఅధికారులు, సంబంధితశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement