వివాదరహిత జీవితాలను గడపాలి | - | Sakshi
Sakshi News home page

వివాదరహిత జీవితాలను గడపాలి

Aug 22 2026 1:23 AM | Updated on Aug 22 2026 1:23 AM

భూపాలపల్లి అర్బన్‌: పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృథా కావడంతో పాటు తీవ్రంగా నష్టపోతారని ప్రతి ఒక్కరూ వివాద రహిత జీవితాలను గడపాలని చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ పుప్పాల శ్రీనివాస్‌ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్‌ వ్యాన్‌ ద్వారా మున్సిపాలిటీ పరిఽధిలోని మంజూర్‌నగర్‌, మహిబూబ్‌పల్లిలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు, ప్రామిసరీ నోట్‌, కుటుంబ, సివిల్‌ తదితర వివాదాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్‌ రఘురామ్‌ మాట్లాడుతూ.. కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదాలకు దూరంగా జీవించాలని కోరారు. న్యాయ సహాయం కోసం నల్సా టోల్‌ఫ్రీ నంబర్‌ 15100ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్‌, మహిత, వెంకటేష్‌, రాజ్‌కుమార్‌, గౌతమి, కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement