● యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
మంద నరసింహారావు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ చేసిన పోరాట ఫలితంగా సుమారు 2 వేల మంది జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు తెలిపారు. భూపాలపల్లి సింగరేణి గెస్ట్‌హౌస్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంస్థ అవసరాల కోసం అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు బదిలీ చేసిన జనరల్ అసిస్టెంట్లకు బేసిక్ వేతనం తగ్గించి తక్కువ జీతాలు చెల్లించడం వల్ల కార్మికులు నష్టపోయారని చెప్పారు. దీనిపై సీఐటీయూ హైకోర్టును ఆశ్రయించగా, పాత వేతనాలు, అలవెన్సులు కొనసాగించడంతోపాటు బకాయిలు చెల్లించాలని కోర్టు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించిందన్నారు. 2012 నాటి సింగరేణి సర్క్యులర్ ప్రకారం అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు వచ్చిన ఉద్యోగుల బేసిక్, గ్రేడ్లు, ప్రమోషన్లు తగ్గించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను బీజేపీ కేటాయించిందని చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ బ్లాక్ సింగరేణికి రావాల్సినదేనని, కే వలం అనుమతి ప్రక్రియ మాత్రమే పూర్తయింద న్నారు. పెండింగ్‌లోని 15 బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. భరోసా యాత్ర పేరుతో బీజేపీ, బీఎంఎస్ కార్మికులను త ప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. వివిధ సంఘాల నుంచి సీఐటీయూలో చేరిన కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి సాయిలు, బ్రాంచ్ కోశాధికారి తోట రమేష్, గుగులోతు శ్రీకాంత్, బాపురావు పాల్గొన్నారు.


