భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

చెల్పూరు, ధర్మారావుపేటలో గ్రామసభలు

పాల్గొన్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ

గణపురం/భూపాలపల్లి రూరల్‌: భూముల రీ సర్వేతో అన్నిరకాల భూ ముల సమస్యలు పరిష్కారమవుతాయని, అధికారులు సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం గణపురం మండలం చెల్పూరు, ధర్మారావుపేట, భూపాలపల్లి మండలంలోని ఎస్‌.ఎం. కొత్తపల్లిలో నిర్వహించిన భూముల రీ సర్వే గ్రామసభల్లో వారు మాట్లాడారు. భూముల రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ఆక్రమణకు గురైన భూములను గుర్తించనున్న ట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. మోకా మీద ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చి రైతు బీమా, రైతు భరోసా, పంట రుణాలు ఇచ్చేలా చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ హక్కులు లేక రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలకు దూ రం అవుతున్నారన్నారు. పైలట్‌ ప్రాజెక్టులో జిల్లాలో 70 గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్లు ఇచ్చామని వారు సర్వేలో పాల్గొంటారని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భూభారతి చ ట్టం రూపొందించిందని తెలిపారు. సర్వే జరిగితే త ప్ప భూ సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర వ్యా ప్తంగా ప్రతి మండలంలో 5 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాస్తవంగా భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులను గుర్తించి పట్టాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, కుసుమ కుమారి, హరికృష్ణ, రాజేశ్వర్‌ రావు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement