మళ్లీ జనగణన | - | Sakshi
Sakshi News home page

మళ్లీ జనగణన

Mar 12 2026 7:39 AM | Updated on Mar 12 2026 7:39 AM

కరోనాతో వాయిదా.. 15 ఏళ్ల తర్వాత త్వరలో శ్రీకారం

రెండుదశల్లో జనగణన

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం

పట్టణీకరణతో వరంగల్‌, హనుమకొండలో

జనాభా భారీగా పెరుగుదల

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021 లో జనగణన చేపట్టాల్సి ఉండగా.. కరోనాతో జరగలేదు. 15ఏళ్ల అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి..

ఉమ్మడి వరంగల్‌ను హనుమకొండ, వరంగల్‌, జనగామ, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ము లుగు జిల్లాలుగా విభజించారు. ఇది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణ నలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది.

దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్‌–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు.

డిజిటల్‌గా జనగణన..

జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో చేప ట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్‌ యాప్‌ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికా రులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్‌లైన్‌ ద్వారా స్వయంగా వివరాలు నమో దు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది.

ఎన్యుమరేటర్లకు శిక్షణ

ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్‌ 2026 వరకు కొనసాగనుంది. రెండో దశలో జనా భా గణన (పాపులేషన్‌ ఎన్యుమరేషన్‌) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. మార్చి 1 2027 ను రిఫరెన్స్‌ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూ డు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), డీఆర్‌ఓ, డీఎఫ్‌ఓ, ఆర్డీఓలు, వరంగల్‌ మహానగర పాలకసంస్థ, మున్సిపల్‌ అధికారులు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు పాల్గొంటున్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: జనగణనను రెండుదశల్లో నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులకు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, విద్యాశాఖల అధి కారులతో రాబోయే 2027 జనగణన (సెన్సెస్‌–2027) ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌, హౌసింగ్‌ సెన్సెస్‌ ఉంటుందని తెలిపారు. ఈదశలో ఎన్యూమరేట ర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల వివరాలు సేకరిస్తార ని తెలిపారు. గృహ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబాల ఆస్తుల సమాచా రం నమోదు చేస్తారన్నారు. ఈ వివరాలు రెండో దశ జనగణనకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ దశలో ఫీల్డ్‌ వర్క్‌తో పాటు 15 రోజుల స్వీయ నమోదు అవకాశం కూ డా ఉంటుందన్నారు. రెండో దశలో ఎన్యూమరేటర్లు ప్రజల వ్యక్తిగత వివరాలు నమో దు చేస్తారన్నారు. ఫీల్డ్‌ వర్క్‌ అనంతరం 5 రోజుల రివిజన్‌ రౌండ్‌ నిర్వహించి వివరాలను ధ్రువీకరించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో సర్వేను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నందున అధి కారులు పొరపాట్లుకు తావులేకుండా లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. కాగా.. జిల్లా కేంద్రంలోని శ్రీనివా స ఫంక్షన్‌ హాల్‌లో నేడు(గురువారం) జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీ, ము న్సిపల్‌ అధికారులతో శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. కాటారం సబ్‌ కలెక్టర్‌ మ యాంక్‌ సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, సీపీఓ జవహర్‌, డీపీఓ శ్రీలత, ము న్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement