భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏరి యాలోని యూనియన్ కార్యాలయంలో బుధవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కార్మికుల ఐక్యపోరాటాల ద్వారా తిరిగి సాధించుకున్న మెడికల్ బోర్డు నిర్వహణను గత సంవత్సరం నమోదైన ఏసీబీ కేసును సాకుగా చూపుతూ నిలిపివేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుమారు పది నెలలుగా అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేక మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను పిలవకపోవడం, పైగా వారిపై నిబంధనల పేరుతో చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. పాత పద్ధతిలో మెడికల్ బోర్డును కొనసాగిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని తెలిపారు. యాజమాన్యం ఒప్పుకున్న ఒప్పందాలను అమలు చేయకపోవడం, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు రాకపోవడం వల్ల సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న శ్రీరాంపూర్ ఏరియా నుంచి ప్రారంభమయ్యే ‘సేవ్ సింగరేణి జాతా’ ద్వారా కార్మికులను చైతన్యపరుస్తూ 30న కొత్తగూడెం హెడ్‌ఆఫీస్ వద్ద జరిగే ము గింపు సభను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్‌లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోటపలుకుల రమేష్, రామచందర్, సుధాకర్‌రెడ్డి, ఆసిఫ్ పాషా పాల్గొన్నారు.
కొరిమి రాజ్‌కుమార్


