భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేని వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతకాలంగా కార్మికుల సమస్యలను పరిష్కరించామని, కార్మిక సంక్షేమానికి యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి పలు ప్రయోజనాలను సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు చేయకుండా కార్మిక సంక్షేమానికి కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు మధుకర్‌రెడ్డి, జోగు బుచ్చయ్య, శశరత్నం, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సెన్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పసునూటి రాజేందర్


