టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

Mar 12 2026 7:39 AM | Updated on Mar 12 2026 7:39 AM

టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

భూపాలపల్లి అర్బన్‌: టెన్త్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్‌ రాబోయే పరీక్షలకు ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా చదివి సిద్ధం కావాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్షలపై భయం లేకుండా అవగాహన కల్పించాలని సూచించారు. చదివిన అంశాలపైనే పరీక్ష ఉంటుందని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం పాఠశాలలోని మధ్యాహ్న భోజనశాలను పరిశీ లించిన కలెక్టర్‌ విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ రాజేందర్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంఈఓ దేవానాయక్‌, సీఎంఓ రమేష్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement