పరీక్షలు చేయట్లే.. | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు చేయట్లే..

Aug 26 2025 7:48 AM | Updated on Aug 26 2025 7:48 AM

పరీక్

పరీక్షలు చేయట్లే..

పరీక్షలు చేయట్లే.. వినియోగంలోకి తీసుకువస్తాం..

జిల్లా ఆస్పత్రిలో అందని సేవలు

తిరగాల్సిందే..

భూపాలపల్లి అర్బన్‌: వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగులకు రక్త, స్కానింగ్‌, ఎక్స్‌రే పరీక్షలు చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆస్పత్రిలో మైక్రోలజీ, పాథాలజీ, స్కానింగ్‌, ఎక్స్‌–రే ఆధునాతన పరికరాలు ఉన్నప్పటికీ వినియోగించడంలో విఫలమవుతున్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో పరీక్షల కోసం రోగులు ప్రైవేట్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదంతా చూస్తున్నా.. వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

రక్త పరీక్షలు టీ హబ్‌కే..

గత ప్రభుత్వం టీ–డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌(టీ–హబ్‌) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలలో అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్స్‌–రే, ఈసీజీ, యూఎస్‌జీ, మమో, టీఫా స్కానింగ్‌లు అందుబాటులో లేవు. అక్కడ ఆస్పత్రులకు వచ్చిన బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే టెస్టుల కోసం రక్తాన్ని సేకరించి, స్కానింగ్‌కు బాధితులను టీ–హబ్‌కు పంపిస్తారు. 24గంటల తరువాత రిపోర్టు వస్తుంది. ఈ హబ్‌లో 57 రకాల పరీక్షలు చేస్తారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోకి పరీక్షలకు ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ రోగుల నుంచి అవసరమైన వారి రక్తాన్ని సేకరించి ప్రతి రక్త పరీక్షకు టీ–హబ్‌కు పంపిస్తున్నారు. అక్కడ వారికి అందుబాటులో లేని రక్త పరీక్షలకు మాత్రమే టీ–హబ్‌కు పంపించాల్సి ఉండగా రెండు మూడు గంటల్లో ఆస్పత్రిలో పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చే సౌకర్యాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయడం లేదు.

స్కానింగ్‌లకు రెండు మూడు రోజులు

కడుపు, నడుము, మూత్రపిండాలు, గర్భిణులకు అప్‌డమిన్‌, ఆల్ట్రా స్కానింగ్‌ల కోసం రోగులు, గర్భిణులు రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తుంది. టీ–హబ్‌లో అల్ట్రా స్కానింగ్‌ చేసే రేడియాలజిస్టు ప్రతిరోజు ఉదయం 9గంటల గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా రోజులో ఒక గంట పాటు కూడా విధులు నిర్వర్తించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేడియాలజిస్టు వచ్చిన సమయంలో స్కానింగ్‌ కోసం వేచి ఉన్న వారికి మాత్రమే స్కానింగ్‌ చేసి వెళ్లిపోతున్నాడు. ఆస్పత్రిలో అప్‌డమిన్‌ స్కానింగ్‌ చేసే రేడియాలజిస్టు ప్రతి రోజు 20 మందికి మాత్రమే స్కానింగ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఉదయం 9గంటలకు రావాల్సిన రేడియాలజిస్టు సమయానికి రాకపోవడం కాకుండా సమయపాలన పాటించకుండా మధ్యాహ్నం ఒంటి గంట వరకే విధుల్లో ఉంటున్నట్లు సమాచారం.

ఆస్పత్రిలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలను వినియోగంలోకి తీసుకువస్తాం. తప్పని పరిస్థితుల్లో టీ–హబ్‌కు పంపిస్తున్నాం. స్కానింగ్‌ రేడియాలజిస్టులు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం.

– డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌,

ఆస్పత్రి సూపరింటెండెంట్‌

స్కానింగ్‌, ఎక్స్‌రేలకూ తప్పని తిప్పలు

ఆధునిక యంత్రాలున్నా

పట్టించుకోవట్లే..

అత్యవసర పరిస్థితుల్లో

ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్న రోగులు

పట్టించుకోని వైద్యులు

జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి అనారోగ్య బారిన పడి ఆస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే వారి రిపోర్టులు రావాలంటే రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తుంది. ఒక రోజు వైద్య పరీక్షలు చేసుకొని రక్తం పరీక్షలకు ఇవ్వడం, రిపోర్ట్‌ కోసం మరుసటి రోజు రావడం, ఆ రోజు రిపోర్టు రాకపోతే మరో రోజు వచ్చి తీసుకొని డాక్టర్‌కు చూపించాల్సిన దుస్థితి నెలకొంది. సమయపాలన పాటించకుండా రోజుకు కొంత టార్గెట్‌ పెట్టుకొని స్కానింగ్‌లు చేయడం వలన జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రెండు మూడు రోజులు తిరగాల్సి ఉందని, ఉదయం ఏడు గంటలకే వచ్చే ముందు ఉండాలని వేచిచూస్తున్నారు.

పరీక్షలు చేయట్లే..1
1/3

పరీక్షలు చేయట్లే..

పరీక్షలు చేయట్లే..2
2/3

పరీక్షలు చేయట్లే..

పరీక్షలు చేయట్లే..3
3/3

పరీక్షలు చేయట్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement