
విద్యార్థులను పరామర్శించిన జడ్జిలు
భూపాలపల్లి అర్బన్: విషతుల్యమైన నీటిని తాగి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సోమవారం న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ పరామర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారికి దైర్యం చెప్పారు. డ్యూటీ డాక్టర్లతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడేలా మంచి చికిత్స అందించాలని సూచించారు. అనంతరం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు దైర్యం చెప్పారు. పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్‌కుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులను పరామర్శించిన జడ్జిలు