
రావయ్యా.. గణపయ్య
నేటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు
భూపాలపల్లి అర్బన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలు నేటినుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్నారు. విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మండపాలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. భక్తిపాటలతో గల్లీగల్లీలో సంబరం నెలకొననుంది. విభిన్న రూపాల్లో వినాయకుడు కొలువుదీరనున్నాడు. జిల్లాకేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో సుమారు 800లకుపైగా గణపతుల మండపాలు ఏర్పాటు చేశారు.
సందడి వాతావరణం..
వినాయక చవితిని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వారంరోజుల నుంచే వినాయక విగ్రహాల విక్రయాలను ప్రారంభించారు. మంగళవారం విగ్రహాలు, పూజ సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు అఽధికసంఖ్యలో భూపాలపల్లికి తరలివచ్చారు. అంబేడ్కర్ సెంటర్‌లో వినాయకుడికి సమర్పించే పత్రి, ఎలక్కాయ, జాపత్రి, ఏకబిల్వం, పండ్లు తదితర సామగ్రితో జనాలు కిక్కిరిసిపోయారు. వినాయక విగ్రహాల ధరలు అధికంగా పెరిగిపోయాయి. రెండు ఫీట్ల నుంచి మొదలుకొని 10 ఫీట్ల వరకు విగ్రహాలను విక్రయించారు. వినాయక పూజలకు కావాల్సిన సామగ్రి దుకాణాలు, పూల దుకాణాలు, స్వీటుహౌజ్‌లు కిటకిటలాడాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసి పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
అధికారులు అప్రమత్తం..
జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్ మీడియా, ప్రకటనల ద్వారా ప్రచార అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 300లకు పైగా ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయి.
ఊరూవాడా ముస్తాబైన మండపాలు
విభిన్న రూపాల్లో కొలువుదీరనున్న గణనాఽథులు

రావయ్యా.. గణపయ్య

రావయ్యా.. గణపయ్య

రావయ్యా.. గణపయ్య