
కాళేశ్వరంలో గణపతి పూజా కార్యక్రమాలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో(నేడు)బుధవారం వినా యక చవితి పండుగ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు ప్రధాన ఆలయ మండపంలో గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి త్రివేణి సంగమం గోదావరికి ఊరేగింపుగా వెళ్లి గణపతి ప్రతిమను నిమజ్జనం చేయనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. భక్తుల పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో షాపులు నడుపుకునేందుకు లైసెన్స్ హక్కుల కోసం ఈ– టెండర్, సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా ఈఓ మహేష్ ఆధ్వర్యంలో నాలుగు టెండర్లు నిర్వహించారు. మంగళవారం టెండర్లకు పర్యవేక్షణాధికారిగా నందనం కవిత పర్యవేక్షణలో స్వీట్ హౌస్ నడుపుకునేందుకు రూ.3.40లక్షలు, పూలదండలు, పూలు, పండ్లు అమ్ముకొను హక్కు రూ.9లక్షలు, సులభ్ కాంప్లెక్స్ నడుపుకునేందుకు రూ.70వేలు, భక్తుల ఫొటోలు తీసుకునేందుకు రూ.1.20లక్షల హెచ్చు పాట వచ్చినట్లు ఈఓ తెలిపారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ. 14.30 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న నిరసన దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ బూరుగు రవికుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో టీజీఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఉదయం 11 గంటలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే బస్సు యాత్రలో ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు విజయలక్ష్మి, సుభాకర్‌రెడ్డి, అశోక్, తిరుపతి, సేవా నాయక్, రఘుకుమార్, శంకర్, విజయ్, మొండయ్య, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో మట్టి గణపతి విగ్రహాలను మంగళవారం ఉచితంగా పంపిణీ చేసినట్లు ఈఓ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ, వెల్ది శరత్‌చంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్‌లు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలు చేస్తున్న స్పాన్సర్షిప్ పథకానికి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ, పేదరికం, అనారోగ్యంతో బాధపడుతున్న బాలలు, బాల్య వివాహ బాధిత బాలలు, లైంగిక వేధింపులకు గురైన బాలలు ఆర్థిక చేయూతను పొందేందుకు విద్య, వైద్య, అభివృద్ధి అవసరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు బాలలు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులని అన్నారు. కులం, ఆదాయం, నివాసం, బ్యాంక్ ఖాతా మొదలైన వివరాలతో కూడిన దరఖాస్తు ఫారాన్ని స్థానిక అంగన్‌వాడీ టీచర్‌కు అందచేయాలని సూచించారు. ఈ పథకానికి ఎంపికై న బాలలకు నెలకు రూ.4వేల చొప్పున స్పాన్సర్‌షిప్ అందించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం స్థానిక అంగన్‌వాడీ టీచర్, సూపర్‌వైజర్, సీడీపీఓ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని డీడబ్ల్యూఓ తెలిపారు.

కాళేశ్వరంలో గణపతి పూజా కార్యక్రమాలు

కాళేశ్వరంలో గణపతి పూజా కార్యక్రమాలు