
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు మేరుగు భావనరుషీ (90) అనార్యోగంతో సోమవారం మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భావనరుషీ భౌతికాయానికి గ్రామస్తులు నివాళ్లర్పించారు.
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అర్చకులుగా ఎంపికై న సంగనభట్ల విజయ్‌కుమార్, రావుల రాజకుమార్, త్రిపురారి శ్రావణ్‌కుమార్, కాకిరాల పవన్‌శర్మలకు ప్రధానార్చకులు పనకంటి ఫణీంద్రశర్మతో కలిసి ఆలయ ఈఓ మహేష్ సోమవారం నియామక పత్రాలను అందించారు. మరో అర్చకుడు కశ్యప్‌శర్మపై పలు అబియోగాలు రావడంతో ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. సోమవారం నలుగురు విధుల్లో చేరినట్లు తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: 25వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. కాలనీలో మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుందన్నారు. కాలనీలో రోడ్లు సరిగ్గా లేవని, సైడ్ కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయిందని చెప్పారు. కాలనీ సమస్యలపై కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్యాతరాజు సతీష్, జోసఫ్, కాలనీ వాసులు రజిత, సంధ్య, స్వప్న పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డీవైఎస్‌ఓ రఘు తెలిపారు. విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, వైద్యాధికారులు ఉమాదేవి, రోహిణి, నిహరీక, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం సింగరేణి ఆధికారులు వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నా టారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో విశాలమైన స్థలం ఉన్నందున పాఠశాలను సింగరేణి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. ఆట స్థలం చదును చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పోషమల్లు, శ్రావణ్‌కుమార్, రాహుల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి